ఇప్పటికే పదిహేను కేసులు పెట్టారు.. మరో కేసు పెడతారట: అయ్యన్నపాత్రుడు
- విశాఖలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన అయ్యన్నపాత్రుడు
- టీడీపీ కోసం ప్రాణాలు వదిలేందుకు సిద్ధమని వ్యాఖ్య
- విశాఖలో వైసీపీ నాయకులు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపణ
దేశంలో అతి తక్కువ ధరకు ఫైబర్ నెట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. తమ హయాంలో రూ.149కే ఫైబర్ నెట్ ఇస్తే, ఇప్పుడు దానిని రూ.450కి పెంచారన్నారు. తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు మద్యం పైనే ఆధారపడ్డారన్నారు. 9.6 శాతం వడ్డీకి పాతికేళ్లకు తనఖా పెట్టి మద్యం అమ్మకాలపై అప్పు తెచ్చారని ఆరోపించారు. ఈ అప్పును ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.