7 మిలియన్ ప్లస్ వ్యూస్ ను కొల్లగొట్టిన గోదారి పాట!
- విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
- ఆయన సరసన సందడి చేయనున్న నేహా శెట్టి
- దూసుకుపోతున్న 'సుట్టంలా సూసి' పాట
- డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల
రీసెంటుగా ఈ సినిమా నుంచి గోదావరి నేపథ్యంలో ఒక పాటను వదిలారు. 'సుట్టంలా సూసి' అంటూ ఈ పాట నడుస్తుంది. హీరో .. హీరోయిన్ పై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట 7 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, శ్రీహర్ష ఈమని సాహిత్యాన్ని అందించగా .. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. యువన్ శంకర్ రాజా బీట్ .. కథ నేపథ్యానికి తగిన సాహిత్యం .. పాటను చిత్రీకరించిన తీరు కనెక్ట్ అయింది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.