నయనతార మాజాకా.. ఇన్‌స్టాలోకి వచ్చిన గంటల్లోనే లక్షలాది ఫాలోవర్లు
- దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఉన్న నయన్
- ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్
- రెండు గంటల్లోనే నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు సొంతం
నయన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే లక్షల్లో ఫాలోవర్స్ చేరారు. కేవలం రెండు గంటల్లోనే నాలుగున్నర లక్షల మంది ఆమెను ఫాలో చేశారు. నయన్ మాత్రం ఐదుగురినే ఫాలో అవుతోంది. మొదటగా భర్త విఘ్నేష్ తర్వాత షారుక్ ఖాన్, అనిరుధ్‌లతో పాటు తమ ప్రొడక్షన్ సంస్థ ది రౌడీ పిక్చర్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను ఫాలో అవుతోంది.