'బెదురులంక 2012' నా నమ్మకాన్ని పెంచింది: సక్సెస్ మీట్ లో హీరో కార్తికేయ

Bedurulanka 2012 Success Meet
  • ఈ నెల 25న విడుదలైన 'బెదురులంక 2012'
  • సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన టీమ్ 
  • ఐదేళ్ల తరువాత హిట్ పడిందన్న కార్తికేయ 
  • చాలా అవాంతరాలను ఎదుర్కొన్నామని వెల్లడి
కార్తికేయ హీరోగా ఈ నెల 25వ తేదీన 'బెదురులంక 2012' సినిమా విడుదలైంది. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యుగాంతం వచ్చేస్తుందంటూ జనాలు భయపడే కాన్సెప్ట్ తో నిర్మితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా భయాలు .. మూఢనమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

అలాంటి పాయింటును పట్టుకుని దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందంటూ, కొంతసేపటి క్రితం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై కార్తికేయ మాట్లాడుతూ .. "ఈ సినిమా హిట్ అయిందంటూ వస్తున్న టాక్ .. వసూళ్లు పెరుగుతున్నాయంటూ వస్తున్న రిపోర్ట్స్ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నేను ఏదైతే అనుకున్నానో .. అదే ఆడియన్స్ అనుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అన్నాడు. 

సెకండాఫ్ చాలా బాగుందని అంటున్నారు .. నాలుగైదు ఏళ్ల తరువాత ఈ సినిమా నాకు చాలా రిలీఫ్ ను ఇచ్చింది. ఈ సినిమా సమయంలో చాలా అవాంతరాలు వచ్చాయి. అయినా హిట్ కొట్టబోతున్నాము అనే విషయం మాకు ముందుగానే తెలిసిపోయింది. నా సినిమాలు ఆడినా .. ఆడకపోయినా నన్ను సపోర్టు చేస్తూ వచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్" అని అన్నాడు

Go Back to Shorts
Karthikeya
Neha Shetty
Bedurulanka 2012

More Telugu News