నేను సినిమా తీస్తే దివాలాయే.. ఇక నిర్మాణం జోలికి పోను: సన్నీ డియోల్
- ఇక మీదట సినిమాలను నిర్మించనన్న సన్నీ డియోల్
- కార్పొరేట్ల ముందు వ్యక్తులు నిలబడడం కష్టమన్న అభిప్రాయం
- వెనుకటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఏకరవు
చివరిగా సన్నీ డియోల్ తన కుమారుడు కరణ్ డియోల్ తో పల్ పల్ దిల్ కే పాస్ సినిమా నిర్మించారు. ఇక మీదట సినిమాలను నిర్మించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఎందుకంటే నేను దివాలా తీస్తాననే. కొన్నేళ్ల క్రితం అయితే కొన్నింటిపై నాకు నియంత్రణ ఉండేది. ఎందుకంటే పంపిణీ సాధారణంగా ఉండేది. మేము ఒకరికొకరం మాట్లాడుకునే వాళ్లం. మా మధ్య అనుసంధానం ఉండేది. కానీ, కార్పొరేట్స్ వచ్చిన తర్వాత ఇంక ఏమీ మిగల్లేదు. వ్యక్తులుగా వారి ముందు నిలబడడం కష్టం. కావాల్సినన్ని థియేటర్లు ఇవ్వరు. వ్యక్తులు అక్కడ ఉండకూడదని వారు కోరుకుంటారు. గత దశాబ్దంలో నా సినిమాల విషయంలో కష్టాలు ఎదుర్కొన్నాను’’ అని సన్నీ డియోల్ సినీ కష్టాలను వివరించారు.