దేవినేని ఉమా, కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
- నాలుగు వారాల పాటు అన్నమయ్య జిల్లాకు వెళ్లకూడదని షరతు
- ప్రతి ఆదివారం కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశం
మరోవైపు ఈ ఘటనలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే, తాను ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించనని ఆయన ముందే స్పష్టంగా చెప్పారు. తమపై దాడి చేసి, తమపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు.