ఘన్‌పూర్ టిక్కెట్ దక్కలేదని వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య
- కార్యకర్తల సమావేశంలో భోరున విలపించిన రాజయ్య
- ఉన్నతస్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పిన ఎమ్మెల్యే
- కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆదేశాలు పాటిస్తానని వెల్లడి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... ఉన్నతస్థానం కల్పిస్తామని కేసీఆర్ తనకు చెప్పారన్నారు. ఇప్పుడు ఉన్న స్థానం కంటే మంచిస్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని, అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆయన ఆదేశాలు పాటిస్తానని స్పష్టం చేశారు.