మిగ్-21 రిటైర్ అయ్యి ఏడాది.. ఆ యుద్ధ విమానాలను ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- మిగ్-21 సేవలకు ఏడాది క్రితం వీడ్కోలు
- హెరిటేజ్ ఫ్లైట్‌లో కొనసాగనున్న కొన్ని విమానాలు
- మరికొన్ని మ్యూజియంలలో ప్రదర్శనకు
- పనిచేసే విడిభాగాలను భద్రపరచనున్న ఆర్మీ
- కొన్ని పరికరాలు ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే ఛాన్స్
ఆకాశంలో ఆరు దశాబ్దాలకు పైగా గర్జించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఏడాది క్రితం భారత వాయుసేన వీడ్కోలు పలికింది. 2025 సెప్టెంబర్ 26న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో చివరి మిగ్-21 విమానాలు తుది సార్వత్రిక ప్రదర్శనతో సేవలకు గుడ్‌బై చెప్పాయి. దీంతో 1963లో మొదలైన ఈ ఫైటర్ జెట్ ప్రయాణం ముగిసింది. అయితే రిటైర్ అయిన తర్వాత ఈ విమానాలన్నీ ఏం అవుతున్నాయి?
వాస్తవానికి అన్ని మిగ్-21లకు ఒకే విధమైన భవితవ్యం ఉండదు. భారత వాయుసేన వద్ద ఉన్న కొన్ని విమానాలను హెరిటేజ్ ఫ్లైట్‌లో ఉంచే అవకాశం ఉంది. అంటే వాటిని యుద్ధ అవసరాల కోసం కాకుండా, భవిష్యత్ తరాలకు భారత విమానయాన చరిత్రను చూపించేందుకు నిర్వహిస్తారు. గతంలో టైగర్ మోత్, హార్వర్డ్, డకోటా వంటి పాత విమానాలను కూడా వాయుసేన ఇదే విధంగా నిర్వహించింది.
మరికొన్ని మిగ్-21లను మ్యూజియంలలో లేదా ప్రముఖ ప్రదేశాల్లో స్టాటిక్ డిస్‌ప్లేలుగా ఉంచే అవకాశం ఉంది. అంటే అవి ఇక ఎగరవు. కానీ ప్రజలు వాటిని దగ్గరగా చూసేలా ప్రదర్శనకు ఉంచుతారు. దేశంలోని రక్షణ సంస్థలు, కంటోన్మెంట్లు, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో ఇలాంటి పాత సైనిక విమానాలను చూడొచ్చు.
విడిభాగాలకూ ఉపయోగం
రిటైర్ చేసిన విమానాల్లో పనిచేసే స్థితిలో ఉన్న కొన్ని విడిభాగాలను కూడా వాయుసేన భద్రపరచనుంది. మిగిలిన వాటిని నిర్దేశిత విధానంలో తొలగిస్తారు. ఉపయోగపడే కొన్ని పరికరాలు, సామగ్రిని ఇంజినీరింగ్ కాలేజీలకు శిక్షణ కోసం అందించే అవకాశం కూడా ఉందని సీనియర్ వాయుసేన అధికారి తెలిపారు.
అయితే మిగ్-21ల్లో ఎన్ని స్క్రాప్‌గా మారతాయనే దానిపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. సాంకేతిక లేదా నిర్ణీత సేవా కాలం పూర్తైన సైనిక విమానాలను నిర్దేశిత ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఇప్పటికే ఓ పాత మిగ్-21 ఎయిర్‌ఫ్రేమ్‌ను వేలంలో విక్రయించగా.. అది హర్యానాలోని రోహ్‌తక్-ఢిల్లీ హైవేపై ఓ దాబా బయట కనిపిస్తోంది. దాని ఇంజిన్‌ను మాత్రం తొలగించారు.
63 ఏళ్ల ప్రయాణం
మిగ్-21 భారత వాయుసేనలో దాదాపు 63 ఏళ్లు సేవలందించింది. ఒకప్పుడు వాయుసేన యుద్ధ విమానాల సముదాయంలో దాదాపు 60 శాతం వరకు మిగ్-21లే ఉండేవి. చివరి దశలో మాత్రం 36 విమానాలు మాత్రమే మిగిలాయి. మొదట 20-25 ఏళ్ల సేవా కాలానికే రూపొందించిన ఈ విమానాలు.. దేశీయంగా పలు మార్పులు, అప్‌గ్రేడ్లతో ఇంత సుదీర్ఘకాలం సేవలందించాయి.
ఇకపై మిగ్-21 యుద్ధ విమానంగా ఆకాశంలో కనిపించకపోయినా.. కొన్ని విమానాలు హెరిటేజ్ ఫ్లైట్‌లో, మరికొన్ని మ్యూజియంలలో, ఇంకొన్ని విడిభాగాల రూపంలో భారత విమానయాన చరిత్రలో కొనసాగనున్నాయి.