చిరు లీక్స్.. ‘కాకా’పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

చిరు లీక్స్.. ‘కాకా’పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

Chiru Leaks Megastar gives amazing update on Kaaka movie
  • ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్త‌యింద‌న్న చిరంజీవి 
  • సెకండాఫ్‌లో 30 శాతం కంప్లీట్ అయిన‌ట్లు వెల్ల‌డి
  • మొదటి భాగానికి రీ-రికార్డింగ్ పనులు ప్రారంభమైంద‌న్న చిరు
  • సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. ఈ సినిమా షూటింగ్ విశేషాలపై మెగాస్టార్ స్వయంగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. 'సిగ్మా' సినిమా వేడుకలో పాల్గొన్న ఆయన, ‘కాకా’ చిత్రీకరణ ఎంతవరకు వచ్చిందో అభిమానులతో పంచుకున్నారు.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం సెకండాఫ్‌లో 30 శాతం చిత్రీకరణ కూడా ముగిసిందని చిరంజీవి వెల్లడించారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన రీ-రికార్డింగ్ పనులను ప్రారంభించారని తెలిపారు. 

సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోందని, దీనిపై తాను పూర్తి ధీమాతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. తమిళ నటుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'సిగ్మా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ విజయం తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘కాకా’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. 

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. వెంకట నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనశ్వర రాజన్, నివేథా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Advertisement
Chiranjeevi
Kaaka Movie Update
Director Bobby
Thaman S
Sankranti 2025 Release
KVN Productions

More Telugu News