అప్పట్లో నేను చేసిన పొరపాటు అదే: సీనియర్ నటుడు నరసింహరాజు
- ఒకప్పుడు హీరోగా వెలిగిన నరసింహరాజు
- పెద్ద దర్శకుల సినిమాలలో చేశానని వెల్లడి
- ఎవరితో టచ్ లో ఉండేవాడిని కాదన్న నటుడు
- అదే తన మైనస్ అని తరువాత తెలిసిందని వ్యాఖ్య
నరసింహరాజు .. 1970 - 80లలో కథానాయకుడిగా తన జోరు చూపించిన నటుడు. ఆయన నటించిన సినిమాలలో 'తూర్పు పడమర' .. 'జగన్మోహిని'ని ప్రేక్షకుల ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన అనేక సినిమాలు చేస్తూ వెళ్లారు. అలాంటి ఆయన రీసెంటుగా 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.
"మొదటి నుంచి కూడా నేను నా పని చేసుకుని వెళుతూ ఉండేవాడిని. ఎవరితో టచ్ లో ఉండేవాడిని కాదు. నాలో అదే మైనస్ అనే విషయం ఆ తరువాత అర్థమవుతూ వచ్చింది. ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో నాలో చాలా మార్పు వచ్చింది. నేనే అందరికీ కాల్ చేసి మాట్లాడుతున్నాను .. పలకరిస్తున్నాను. అప్పట్లోనే ఇలా ఉండి ఉంటే .. పెద్ద దర్శకులతో .. నిర్మాతలతో టచ్ లో ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు.
"అప్పట్లో నేను చాలా పెద్ద దర్శకుల సినిమాలలో చేశాను. ఆ దర్శకుల దగ్గర పనిచేసినవాళ్లు, ఆ తరువాత కాలంలో దర్శకులయ్యారు. ఆ తరువాత తరంలో వచ్చిన రవిరాజా పినిశెట్టి .. కోడి రామకృష్ణ .. రేలంగి నరసింహారావు గారి వాళ్ల సినిమాలలో నేను చేయలేకపోయాను. అందుకు కారణం నేను టచ్ లో లేకపోవడమే. నేను టచ్ లో ఉంటే తప్పకుండా వాళ్ల సినిమాలు చేసి ఉండేవాడిని. మా అబ్బాయికి సినిమాలలో చేయాలనే ఆసక్తి ఉండేది .. కానీ నాకే ఇష్టం లేదు. ప్రస్తుతం అతను కెనడాలో సెటిలయ్యాడు .. హ్యాపీగా ఉన్నారు" అని చెప్పారు.