నకిలీ ఆధార్‌లకు చెక్.. డూప్లికేట్ ఆధార్ల భరతం పట్టేందుకు దేశీయ టెక్నాలజీ
- నకిలీ ఆధార్ కార్డుల గుర్తింపునకు 'భారత్ ఏబీఐఎస్' అనే కొత్త వ్యవస్థ
- యూఐడీఏఐ పరిశోధకుల ఆధ్వర్యంలో దేశీయంగా అభివృద్ధి
- పరీక్షల్లో నిర్దేశిత లక్ష్యాలను మించి అత్యుత్తమ ఫలితాలు
- భారత పూర్తి డేటాబేస్‌పై ఇంకా విస్తృత పరీక్షలు జరగాల్సి ఉందన్న నిపుణులు
దేశంలో ఆధార్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా భారత పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. నకిలీ ఆధార్ కార్డులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు 'భారత్ ఏబీఐఎస్' (Bharat ABIS) అనే సరికొత్త ఓపెన్ సోర్స్ బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
యూఐడీఏఐతో సంబంధం ఉన్న పరిశోధకులు, ఐఐఐటీ హైదరాబాద్, మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణుల బృందం సంయుక్తంగా ఈ టెక్నాలజీని రూపొందించింది. ఇది దేశవ్యాప్తంగా ఆధార్ డేటాబేస్‌లో డూప్లికేట్ ఎంట్రీలను ఏరివేయడంలో కీలకంగా మారనుంది.
'భారత్ ఏబీఐఎస్' అనేది వేలిముద్రలు, కనుపాప (ఐరిస్), ముఖ కవళికలను కలిపి బయోమెట్రిక్స్‌ను విశ్లేషించే ఒక మల్టీ-మోడల్ వ్యవస్థ. ఈ మూడు డేటాలను కలిపి ప్రతి వ్యక్తికి కేవలం 13.5 KB పరిమాణంలో ఒక టెంప్లేట్‌ను ఇది సృష్టిస్తుంది. దేశంలోని మొత్తం 155 కోట్ల ఆధార్ ఎంట్రీల నుంచి నమూనాగా సేకరించిన 22 కోట్ల డీ-ఐడెంటిఫైడ్ రికార్డులపై ఈ వ్యవస్థను పరీక్షించారు.
ముఖ్యంగా 2 కోట్ల రికార్డుల సబ్‌సెట్‌పై జరిపిన పరీక్షల్లో ఇది అద్భుతమైన ఫలితాలను కనబరిచింది. తప్పుడు గుర్తింపుల రేటు (ఎఫ్‌పీఐఆర్) కేవలం 0.1 శాతంగా, అసలైన వాటిని గుర్తించడంలో వైఫల్యం రేటు (ఎఫ్ఎన్ఐఆర్) 0.05 శాతంగా నమోదైంది. ఈ ఫలితాలు యూఐడీఏఐ నిర్దేశించిన 0.5% ఎఫ్‌పీఐఆర్, 0.1% ఎఫ్ఎన్ఐఆర్ లక్ష్యాల కన్నా చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. ఎఫ్‌పీఐఆర్,
ఈ వ్యవస్థ రూపకల్పనలో ఓపెన్ సోర్స్ భాగాలను వినియోగించడం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. డేటా ప్రాసెసింగ్, నాణ్యత అంచనా, ఫేక్ బయోమెట్రిక్స్‌ను గుర్తించడం వంటి పనుల కోసం ఓపెన్ సోర్స్ టూల్స్‌నే వాడారు. భారీ డేటాబేస్‌లో శోధన ప్రక్రియ వేగంగా జరిగేందుకు సర్వర్లపై పనిభారాన్ని సమానంగా పంపిణీ చేసే ఒక ప్రత్యేక షెడ్యూలర్‌ను కూడా ఇందులో పొందుపరిచారు.
వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న మూడు ప్రముఖ వ్యవస్థలతో పోల్చినప్పుడు 'భారత్ ఏబీఐఎస్' వాటికి సమానమైన లేదా అంతకంటే మెరుగైన కచ్చితత్వాన్ని చూపించింది. 8 ఎన్విడియా H100 జీపీయూలు, 2 టీబీ ర్యామ్‌తో కూడిన ఒక్క సర్వర్‌పై 4 కోట్ల రికార్డుల గ్యాలరీలో సెకనుకు 100 శోధనలు చేయగల సామర్థ్యం దీనికి ఉంది.
దేశంలో డూప్లికేట్ ఆధార్ కార్డులు ఇప్పటికీ ఒక సవాలుగానే ఉన్నాయి. 2022లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దాదాపు 6 లక్షల నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 'భారత్ ఏబీఐఎస్' ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులోని 'డీప్‌ప్రింట్' ఫింగర్‌ప్రింట్ మోడల్.. వృద్ధులు, చేతివేలిముద్రలు అరిగిపోయిన శ్రామికుల బయోమెట్రిక్ ప్రామాణీకరణ వైఫల్యాలను సగానికి తగ్గించగలదని పరిశోధకులు తెలిపారు.
అయితే, ఈ వ్యవస్థ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, దేశంలోని పూర్తి ఆధార్ డేటాబేస్‌పై దీనిని ప్రయోగించడానికి ముందు మరిన్ని విస్తృత స్థాయి పరీక్షలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో 2 కోట్ల లోపు జనాభా ఉన్న దేశాలకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగలదని వారు పేర్కొన్నారు.