పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు మరింత సమయం ఇవ్వండి: లోక్‌సభ స్పీకర్ కు జితిన్ రామ్ మాంజీ లేఖ

పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు మరింత సమయం ఇవ్వండి: లోక్‌సభ స్పీకర్ కు జితిన్ రామ్ మాంజీ లేఖ

Jitan Ram Manjhi writes to Lok Sabha Speaker for more time to SC ST MPs
  • సభలో కీలక బిల్లులపై చర్చ జరిగే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు అదనపు సమయం ఇవ్వాలన్న మాంజీ
  • తమ సామాజిక వర్గానికి తగినంత సమయం అవసరమన్న మాంజీ
  • తమ అభ్యర్థనను సీరియస్‌గా పరిగణించాలని విన్నపం

పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల గళానికి మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర మంత్రి, ఎన్డీఏ మిత్రపక్ష నేత జితన్ రామ్ మాంజీ ఒక లేఖ రాశారు. పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన బిల్లులపై చర్చ జరిగే తరుణంలో, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు సభలో మాట్లాడేందుకు మరికొంత అదనపు సమయం కేటాయించాలని ఆయన ఆ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.


ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ ప్రధానాంశం చర్చకు వచ్చినట్లు మాంజీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ ఈ ప్రస్తావన తెచ్చారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి చెందిన ప్రత్యేక సమస్యలు, అంశాలను సభలో వివరంగా ప్రస్తావించేందుకు ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు తగినంత సమయం అవసరమని పటేల్ కోరినట్లు మాంజీ తన లేఖలో ప్రస్తావించారు.


ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ చేసిన ఈ అభ్యర్థనను సీరియస్‌గా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అవసరమైతే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. మరోవైపు, సభలో తమకు అసలు సమయమే కేటాయించడం లేదని తాము అనడం లేదని.. తమ వర్గాల సమస్యలపై మరింత లోతుగా చర్చించేందుకు కేటాయించిన సమయాన్ని మరింత పెంచాలని మాత్రమే కోరుతున్నట్లు ఎంపీ పటేల్ గతంలో ఒక మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

Advertisement
Jitan Ram Manjhi
Om Birla
Lok Sabha Speaker
SC ST MPs
Parliament Speaking Time
Scheduled Castes Scheduled Tribes

More Telugu News