ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. ఎప్పటి నుంచంటే!
- నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్
- మేనల్లుడితో కలిసి పవన్ కల్యాణ్ నటించిన సినిమా
- జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి హిట్ టాక్
బ్రో ఓటీటీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రో.. ది అవతార్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ తాజాగా అప్ డేట్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, తొలుత ఈ సినిమాను పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, వారం రోజుల ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది.