స్కంద నుంచి మాస్ బీట్.. స్టెప్పులతో అదరగొట్టిన రామ్, శ్రీలీల

secound single Gandarabai released from Skanda
  • జంటగా అలరించనున్న పోతినేని రామ్, శ్రీలీల 
  • బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా
  • సెప్టెంబర్ 15న ఐదు భాషల్లో విడుదల  
పోతినేని రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘స్కంద’. అందల నటి శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ గ్లింప్స్ తో పాటు ‘నీ  చుట్టూ తిరిగిన’ అనే తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. 

ఈ సినిమా నుంచి తాజాగా రెండో పాటను విడుదల చేశారు. ‘గండర గండర గండర భాయి’ అంటూ సాగే మాస్ పాటలో రామ్, శ్రీలీల హుషారైన స్టెప్పులతో అలరించారు. తమన్ కంపోజ్ చేసిన పాటకు అనంత శ్రీరామ్ మాసీ సాహిత్యం అందించాడు. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల కలిసి పాడారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Advertisement
ram
srileela
Boyapati Sreenu
skanda

More Telugu News