కేంద్రంలో మళ్లీ మోదీనే.. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఎన్డీయే ఘన విజయం: టైమ్స్ నౌ తాజా సర్వే
- ఎన్డీయే కూటమికి 296 నుంచి 326 సీట్లు వస్తాయన్న సర్వే
- 160 నుంచి 190 సీట్లకు పరిమితం కానున్న ఇండియా కూటమి
- ఎన్డీయేకు 42.60 శాతం ఓట్లు... ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు వస్తాయని అంచనా
అధికార, విపక్ష కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లను గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే రెండు కూటమిలకు మధ్య ఓట్ల శాతంలో తేడా మాత్రం చాలా తక్కువగానే ఉండబోతోందని పేర్కొంది. ఎన్డీయేకు 42.60 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.