400 కోట్ల క్లబ్ లోకి 'జైలర్'

Jailer movie update
  • ఈ నెల 10వ తేదీన విడుదలైన 'జైలర్'
  • 5 రోజులలో 357.60 కోట్ల గ్రాస్ 
  • నిన్నటితో 400 కోట్లు రాబట్టి ఉంటుందనే అంచనా
  • ఈ వారాంతంలోను కొనసాగనున్న జోరు   
రజనీకాంత్ తాజా చిత్రంగా ఈ నెల 10వ తేదీన 'జైలర్' విడుదలైంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ .. తమన్నా ... సునీల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమా, తొలిరోజునే రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. 

ఈ సినిమా ఈ నెల 14వ తేదీతో 5 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 5 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 357.60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక నిన్న ఆగస్టు 15 సందర్భంగా థియేటర్ల దగ్గర ఒక రేంజ్ లో సందడి కనిపించింది. భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. 

వీకెండ్ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమాకి, నిన్న హాలిడే కూడా బాగా కలిసొచ్చిందని అంటున్నారు. నిన్నటితో ఈ సినిమా 400 కోట్ల క్లబ్ లోకి ఖాయంగా చేరిపోయి ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఈ వారంలోను 'జైలర్'కి పోటీగా నిలిచే స్థాయి సినిమాలేమీ ఇక్కడ లేవు. అందువలన ఈ వారాంతంలోను 'జైలర్' మరిన్ని వసూళ్లు రాబట్టడంలో సందేహం లేదనిపిస్తోంది.
Advertisement
Rajanikanth
Ramyakrishna
Sunil
Nelson
Jailer

More Telugu News