హైకోర్టులో లాయర్ గా బొత్స సత్యనారాయణ భార్య
- బార్ అసోసియేషన్ మెంబర్ గా రిజిస్టర్ చేసుకున్న బొత్స ఝాన్సీ
- రెండుసార్లు ఎంపీగా సేవలందించిన మాజీ ఎంపీ
- ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు
విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ గా రెండుమార్లు, బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగానూ ఝాన్సీ ప్రజాసేవ చేశారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే చదువు కొనసాగించారు. చదువుకు వయస్సు అడ్డు కాదని ముందుకుసాగారు. రాజకీయాల్లో మహిళా సాధికారిత కోసం ప్రయత్నించిన ఝాన్సీ ఉన్నత విద్యలో కూడా అటు వైపే సాగారు. ఎంపీగా ఉన్న సమయంలోనే ఫిలాసఫీలో మహిళా సాధికారత, సామాజిక న్యాయశాస్త్రంపై పీహెచ్ డీ పూర్తిచేశారు.