ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు..నితిన్ దేశాయ్ మృతిపై స్నేహితుడి వ్యాఖ్య
- ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్‌పై ఫైనాన్స్ సంస్థలు అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాయన్న స్నేహితుడు
- ఒత్తిడి తట్టుకోలేకే మరణంవైపు అడుగులు వేసి ఉంటాడని వ్యాఖ్య
- ఈమారు పుట్టినరోజు జరుపుకోనని నితిన్ దేశాయ్ గతంలో వ్యాఖ్యానించారని వెల్లడి
- ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటాడని అప్పట్లో ఊహించలేదని వ్యాఖ్య
నితిన్ దేశాయ్ కూతురు అమెరికా వెళ్లేముందు కుటుంబమంతా కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భార్య, కూతురు పట్టుబట్టిన విషయాన్ని నితిన్ కులకర్ణి గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ మారు తాను పుట్టినరోజు జరుపుకోనని నితిన్ దేశాయ్ చెప్పారని అన్నారు. చివరకు ఆయన ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటారని తాము అప్పట్లో అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.