నారాసురుడు ఉన్నంత కాలం రాష్ట్రంలో అశాంతి: మంత్రి కొట్టు సత్యనారాయణ

Minister Kottu lashes out at Chandrababu
  • ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత బాబుకు లేదన్న మంత్రి
  • గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్య
  • ధర్మాన్ని ఆచరించిన వారికే అంతిమ విజయమన్న కొట్టు
ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. పద్నాలుగేళ్ళు అధికారంలో ఉండి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నారాసురుడు ఉన్నంత కాలం రాష్ట్రంలో అశాంతి ఉంటుందన్నారు. 

పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వచ్చిన చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, గూండాలను రప్పించుకొని అల్లర్లు చేసే స్థాయికి టీడీపీ అధినేత దిగజారారన్నారు. 

ఎంతసేపూ హైటెక్కు... హైదరాబాద్ అనడం తప్ప ఇంకేమీ లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని కోరుకుంటున్నారన్నారు. తాను దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా చెబుతున్నానని, ఎవరు అయితే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి అంతిమ విజయం వస్తుందన్నారు.
Advertisement
kottu satyanarayana
YSRCP
Chandrababu

More Telugu News