ఎంఐఎం నుంచి బహిష్కరణ.. అవి డీప్‌ఫేక్ వీడియోలన్న ఎమ్మెల్సీ
- ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన మజ్లిస్
- సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నవి డీప్‌ఫేక్ వీడియోలని ఆరోపణ
- తనను, పార్టీని అప్రతిష్టపాలు చేసే కుట్ర అని రహ్మత్ బేగ్ వ్యాఖ్య
- వీడియోలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ముందే ఫిర్యాదు చేశానని వెల్లడి
తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను ఎంఐఎం పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వైరల్ కావడంతో పార్టీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారని రహ్మత్ బేగ్ ఆరోపించారు.
పార్టీ బహిష్కరణకు ముందే తన కుటుంబంతో కలిసి మక్కా వెళ్లిన రహ్మత్ బేగ్, అక్కడి నుంచే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హైదరాబాద్‌లోని తన స్నేహితులు ఫోన్ చేసి సోషల్ మీడియాలో కొన్ని అశ్లీల వీడియోలు వైరల్ అవుతున్నట్లు సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర పన్నారని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు పార్టీని, పార్టీ అధినేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీల ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించారని ఆయన వివరించారు.
ఈ అంశంపై తాను ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగంతో పాటు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని రహ్మత్ బేగ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 28వ తేదీ రాత్రి ఎంఐఎం అధిష్ఠానం ఆయనను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. శాసనమండలి సభ్యత్వానికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే, బహిష్కరణకు గల నిర్దిష్ట కారణాలను పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. తాజా పరిణామాలపై స్పష్టత ఇవ్వాలని ఇతర రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.