జీవితకాలం అతన్నే ప్రేమిస్తుంటా: రష్మిక మందన్న
- ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక
- ఆమె పెళ్లి గురించి ప్రశ్నించిన ముంబై పాత్రికేయులు
- నరుటో అనే వ్యక్తితో ఎప్పుడో పెళ్లయిపోయిందన్న కన్నడ బ్యూటీ
తనకు నరుటో అనే వ్యక్తితో ఎప్పుడో పెళ్లయిపోయిందని ఆమె చెప్పింది. జీవితకాలం అతడినే ప్రేమిస్తుంటానని తెలిపింది. ఈ నరుటో ఎవరో అని మీడియా ప్రతినిధులు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత జపనీస్ కార్టూన్ వెబ్ సిరీస్ హీరో నరుటో అని తెలుసుకుని నవ్వుకున్నారు. మరోవైపు ప్రస్తుతం 'పుష్ప 2', 'రెయిన్ బో' చిత్రాల్లో రష్మిక నటిస్తోంది.