"లేదు చెల్లెమ్మా" అంటూ... పూనమ్ కౌర్ ట్వీట్ కు రామ్ గోపాల్ వర్మ స్పందన

Ram Gopal Varma responds to Poonam Kaur tweet
  • రాజకీయాలు వినోదాత్మకంగా మారుతున్నాయన్న పూనమ్ కౌర్
  • వినోదం మాత్రం సీరియస్ గా మారుతోందని ట్వీట్
  • వాస్తవానికి రాజకీయాలే సినిమాల్లా మారుతున్నాయన్న వర్మ
కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ భామ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో కాక రేపుతుంటుంది. ప్రత్యేకించి కొందరు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఉండే ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశం అవుతుంటాయి. 

తాజాగా పూనమ్ కౌర్ మరో ట్వీట్ చేసింది. రాజకీయాలు ఎంతో వినోదాత్మకంగా మారుతున్నాయని, వినోదం మాత్రం చాలా సీరియస్ గా మారుతోందని పేర్కొంది. ఈ ట్వీట్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 

"లేదు చెల్లెమ్మా... వాస్తవానికి రాజకీయాలు సినిమాల్లా మారుతున్నాయి, సినిమా రాజకీయమయం అవుతోంది అనుకుంటున్నాను" అని బదులిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పూనమ్ కౌర్, వర్మ చేసిన ట్వీట్లకు విశేష రీతిలో స్పందన వస్తోంది.
Advertisement
Ram Gopal Varma
Poonam Kaur
Cinema
Politics
Tollywood

More Telugu News