'LGM' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'LGM'
- చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఇవాన
- కీలకమైన పాత్రను పోషించిన నదియా
- తెలుగు .. తమిళ భాషల్లో ఆగస్టు 4న రిలీజ్
తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగును విడుదల చేశారు. 'లలనా .. లలనా ప్రేమ ఒళ్లో పడ్డానా' అంటూ ఈ పాట సాగుతోంది.
హీరో .. హీరోయిన్ పై బీచ్ లో నైట్ లో చిత్రీకరించిన పాట ఇది. ఈ సినిమాకి సంగీతాన్ని కూడా రమేశ్ తమిళమణి అందించడం విశేషం. నదియా .. యోగిబాబు .. దీపా శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'లవ్ టుడే' సినిమాతో తెలుగులోను యూత్ ను ఆకట్టుకున్న ఇవాన, ఈ సినిమాతో ఇక్కడ అభిమానుల సంఖ్యను పెంచుకుంటుందేమో చూడాలి.