‘రామాయణం’ ఆధారంగా సినిమా.. సీతారాములుగా రణబీర్, ఆలియా?
- అల్లు అరవింద్, మధు మంతెన, సమిత్ మల్హోత్రా సమర్పణలో తెరకెక్కనున్న చిత్రం
- తారల ఎంపిక, స్క్రీన్ టెస్టు పనుల్లో బిజీబిజీగా దర్శకుడు నితీశ్ తివారీ
- సీతారాములుగా రణబీర్-ఆలియా, రావణుడిగా యశ్ నటించనున్నారని టాక్
తాజాగా ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దర్శకుడు నితీశ్ తివారీ సినిమా పనులను మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలైన రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు కోసం ఆర్టిస్టుల ఎంపిక, స్క్రీన్ టెస్ట్ నిర్వహించేందుకు నితీశ్ సన్నాహాల్లో ఉన్నారట. విశేషం ఏంటంటే, సీతారాములుగా రణబీర్, ఆలియా దంపతులు కనిపించబోతున్నారట. ఇక ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యశ్ రావణుడిగా నటిస్తారని తెలుస్తోంది.