అమరావతిలో జగన్నాథ రథయాత్ర.. బంగారు చీపురుతో ఊడ్చి సేవ చేసిన సీఎం చంద్రబాబు
- రాజధాని అమరావతిలో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర
- బంగారు చీపురుతో ఊడ్చి రథాన్ని లాగిన సీఎం చంద్రబాబు
- ఆధ్యాత్మికతతోనే ఒత్తిడి దూరం అవుతుందన్న ముఖ్యమంత్రి
- రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని ప్రకటన
- అమరావతి, పోలవరం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీలో నిర్వహించే సంప్రదాయ క్రతువు తరహాలో రథం ముందు భాగాన్ని బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి చంద్రబాబు తన సేవను చాటుకున్నారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆశీనులైన రథాన్ని తాడుతో లాగి యాత్రను ప్రారంభించారు.
ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి.నారాయణ, స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా, అమరావతి బృహత్ ప్రణాళిక చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి, రాజధాని నగరం విశ్వనగరంగా ఎదగాలని ఆయన జగన్నాథ స్వామిని ప్రార్థించారు.
అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్రకు ఎంతో విశిష్టత ఉందని, అందరూ అక్కడికి వెళ్లలేరని, అలాంటిది తొలిసారిగా అమరావతిలో ఈ యాత్ర నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఈ యాత్రలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఇకపై ప్రతిఏటా అమరావతిలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తామని ఇస్కాన్ ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్‌లు అందిస్తున్న సేవలను చంద్రబాబు కొనియాడారు. దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 25 వేలకు పైగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్షయపాత్ర నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున 500 కోట్ల మందికి ఆహారం అందించడం అరుదైన విషయమని ప్రశంసించారు. ఏపీలో 10 సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా రోజూ 1.80 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నట్లు వివరించారు.
ఆధునిక జీవనశైలి వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ, మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం కుటుంబాలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, జీవితాల్లో ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
"మైక్రో ఫ్యామిలీలు కాదు, ఉమ్మడి కుటుంబాలు కావాలి. అదే మన భారతీయ సంప్రదాయం" అని ఆయన పిలుపునిచ్చారు. సమాజం ప్రశాంతంగా ఉండటానికి దేవాలయాలు దోహదపడతాయని, అందుకే రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్నాథ రథయాత్ర తలపెట్టగానే అమరావతిలో వర్షం కురిసి వాతావరణం చల్లబడటం శుభసూచకమని అన్నారు. ఆ జగన్నాథ స్వామి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.