మహేశ్ సినిమా కోసం ముగ్గురు బాలీవుడ్ స్టార్లను దింపనున్న జక్కన్న!
Add ap7am to your home Screen

మహేశ్ సినిమా కోసం ముగ్గురు బాలీవుడ్ స్టార్లను దింపనున్న జక్కన్న!

Rajamouli to rope Three bollywood actors in Mahesh babu movie
  • ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ తో సినిమాను ప్రకటించిన రాజమౌళి
  • హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమాను ప్లాన్‌ చేస్తున్న జక్కన్న
  • చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి. అంతటి అఖండ విజయం సాధించిన తర్వాత ఆయన తీయబోయే తదుపరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందా అని ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ అడ్వెంచర్‌‌ డ్రామా తీయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించారు. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అలాగే, కీలక పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్ నటులను తీసుకుంటారని తాజా సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఓ హీరోయిన్‌గా ఆలియా భట్ తో పాటు అజయ్ దేవగణ్ ను తీసుకున్న జక్కన్న ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి చిత్రంకోసం మేకోవర్ కానున్నారు. ప్రత్యేకంగా మూడు నెలల పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిక్షణ తీసుకుంటారని తెలుస్తోంది.
Advertisement
Rajamouli
Mahesh Babu
Tollywood
Bollywood
RRR

More Telugu News