BRO: మైడియర్ మార్కండేయ.. 'బ్రో' నుంచి ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఖరారు

First single from BRO will be out tomorrow
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో నుంచి ఇప్పటివరకు అనేక అప్ డేట్స్ వచ్చినా, పాటలు ఇంకా రాలేదు. ఇప్పుడా కొరత తీరనుంది. రేపు (జులై 8) బ్రో నుంచి ఫస్ట్  సింగిల్ విడుదల కానుంది. 

మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ గీతం శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. బ్రో చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ పాత్ర పేరు 'మార్కండేయ' అని పవన్ పాత్ర పేరు 'కాలుడు' అని తెలుస్తోంది.
Go Back to Shorts
BRO
First Single
My Dear Markandeya
Pawan Kalyan
Sai Dharam Tej
Samuthirakani
Tollywood

More Telugu News