ఈ రాష్ట్రంలో కేజీ టమాటా రూ. 250
- ఉత్తరాఖండ్ లో మండిపోతున్న టమాటా ధర
- గంగోత్రి ధామ్ లో కేజీ టమాటా రూ. 250
- హైదరాబాద్ లో రూ. 100 నుంచి 130 మధ్య ఉన్న ధర
టమాటా పండే ప్రాంతాల్లో హీట్ వేవ్ కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉందని పలువురు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రవాణాకు ఆటంకాలు ఏర్పడటం కూడా మరో కారణమని అంటున్నారు. మరోవైపు బెంగళూరులో కేజీ టమాటా రూ. 100 నుంచి 120 మధ్యలో ఉంది. హైదరాబాద్, చెన్నైలో రూ. 100 నుంచి 130 మధ్యలో ఉంది.