పవన్ ఇరిటేషన్ స్టార్.. బాబు ఇమిటేషన్ స్టార్.. జగన్ ఇన్స్పిరేషన్ స్టార్: రోజా
- రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యమన్న రోజా
- జగన్ వెంట్రుకను కూడా బాబు, పవన్ పీకలేరని ఎద్దేవా
- జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారని వ్యాఖ్య
ఇచ్చిన మాట కోసం విజయ డెయిరీని జగన్ పునఃప్రారంభిస్తున్నారని రోజా అన్నారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ కోసం విజయ డెయిరీని మూయించారని ఆరోపించారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విజయ డైయిరీకి జగన్ ప్రాణం పోస్తున్నారని చెప్పారు. జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారని అన్నారు.