బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదు: కిషన్ రెడ్డి
- బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శ
- సీఎం కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపణ
- రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్న కేంద్ర మంత్రి
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అవినీతిమయం అయిందన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్లు మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతారన్నారు. బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.