భోళా శంకర్ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భోళా శంకర్ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు

Bhola Shankar teaser will be out on June 24
  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిత్రం
  • జూన్ 24న టీజర్ విడుదలకు రంగం సిద్ధం
  • ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న భోళా శంకర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ మెగా లెవల్లో ఆకట్టుకున్నాయి. తాజాగా భోళాశంకర్ నుంచి టీజర్ రానుంది. దీనికి ముహూర్తం ఖరారైనట్టు లేటెస్ట్ అప్ డేట్ లో వెల్లడించారు. జూన్ 24న భోళా శంకర్ నుంచి జిగేల్మనిపించేలా టీజర్ రానుందని చిత్రబృందం వెల్లడించింది. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలి పాత్ర పోషిస్తోంది. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ఎంటర్టయినర్ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Bhola Shankar
Teaser
Chiranjeevi
Meher Ramesh
Tollywood

More Telugu News