Harshith Reddy: 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' ట్రైలర్ రిలీజ్!

Arthamayyinda Arun Kumar Web Series Update
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో తెలుగు వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ పెరుగుతోంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఈ తరహా వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈ కేటగిరి సిరీస్ లను అందించడంలో  'ఆహా' వారు ఉత్సాహంగా ఉన్నారు. అలా 'ఆహా' వేదిక ద్వారా పలకరించనున్న  సిరీస్ నే 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్'. 

హర్షిత్ రెడ్డి - అనన్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ ను నియతి నిర్మించారు. జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించాడు. అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చిన ఈ వెబ్ సిరీస్ ను ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. లవ్ .. కామెడీ ... రొమాన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. 

ఈ నేపథ్యంలో ప్రియదర్శి చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.   ప్రియదర్శి మాట్లాడుతూ .. "సినిమాల్లో  అవకాశాల కోసం వచ్చి వెయిట్ చేస్తున్నవారికి 'ఆహా' ఒక మంచి ఫ్లాట్ ఫామ్. నేను కూడా 'ఆహా' ద్వారా మంచి సినిమాలు చేయగలిగాను. ఆహా సక్సెస్ స్టోరీలో నేను ఒక పార్టు అయినందుకు ఆనందంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ యూత్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
Harshith Reddy
Ananya
Tejaswi

More Telugu News