‘కేజీఎఫ్‌’ను మించి ఉంటుందట.. ‘సలార్’పై అంచనాలు పెంచేసిన శ్రియా రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘కేజీఎఫ్‌’ను మించి ఉంటుందట.. ‘సలార్’పై అంచనాలు పెంచేసిన శ్రియా రెడ్డి

sriya reddy comments on prabhas salaar movie
  • ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్‌, యాక్షన్‌ను చూడలేదన్న శ్రియా రెడ్డి
  • ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఓ ప్రపంచాన్ని ప్రశాంత్‌ నీల్‌ సృష్టించారని వెల్లడి
  • సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సలార్
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ కావడం, ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సలార్.. కేజీఎఫ్ ను మించి ఉంటుందని నటి శ్రియా రెడ్డి చెప్పారు.  

‘పొగరు’ సినిమాలో విలన్ గా మెప్పించిన శ్రియా రెడ్డి.. సలార్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సలార్‌’ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘సలార్‌ సినిమా ‘కేజీఎఫ్‌’కు మించి ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్‌, యాక్షన్‌ను చూడలేదు’’ అని చెప్పారు.

ప్రశాంత్‌ నీల్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ లాగా ఒక ప్రపంచాన్ని సృష్టించారని, ఇందులో ప్రభాస్‌ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడని తెలిపారు. ప్రభాస్ స్క్రీన్‌ మీద కనిపించగానే ప్రేక్షకులు కచ్చితంగా కేరింతలు కొడతారని, సినిమాలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అంచనాలను పెంచేశారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న సలార్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రపంచానికి సీపీఆర్‌ ఇచ్చే సమయం వచ్చింది. సెప్టెంబర్‌ 20న సలార్‌ కోసం సిద్ధంగా ఉండండి’’ అంటూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. శ్రుతి హాసన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ వచ్చే నెల మొదటి వారంలో రానుందని టాక్‌ వినిపిస్తోంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
Advertisement
salaar
sriya reddy
KGF
Prabhas
Prashanth Neel

More Telugu News