పవన్ కల్యాణ్ పై రౌడీ కేసులు కూడా ఉండొచ్చు: బొత్స

Pawan Kalyan is a goonda says Botsa
  • పవన్ కల్యాణ్ పెద్ద రౌడీ, గూండా అన్న బొత్స
  • వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
  • తనపై ఒక్క కేసు కూడా లేదని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక పెద్ద రౌడీ, గూండా అని విమర్శించారు. పవన్ పై రౌడీ కేసులు కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. జనసేనలో అందరూ రౌడీలేనని అన్నారు. తనపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. వైసీపీ నేతలపై పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. 

ఉపాధ్యాయుల భర్తీలను పారదర్శకంగా పూర్తి చేశామని బొత్స తెలిపారు. మొత్తం 1.75 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 82 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. సీనియర్ హెడ్మాస్టర్లను సెకండ్ ఎంఈవోలుగా నియమించామని అన్నారు. వడగాలుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మరో వారం రోజుల పాటు ఒంటి పూట బడులను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సింగిల్ టీచర్ పాఠశాలలు 9 వేలు ఉన్నాయని తెలిపారు. సింగిల్ టీచర్ సెలవు పెట్టే పాఠశాలలకి అందుబాటులో ఉండేలా మండలానికి నలుగురైదుగురు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News