'ఆదిపురుష్' ఎఫెక్ట్.. అన్ని హిందీ సినిమాలపై నిషేధం విధించిన నేపాల్ లోని రెండు నగరాలు
- 'ఆదిపురుష్' సినిమాపై నేపాల్ లో వ్యతిరేకత
- సీత ఇండియాలో పుట్టిందనే డైలాగ్ పై ఆగ్రహం
- ఖాట్మండూ, పోఖారాలో హిందీ సినిమాలపై బ్యాన్
ఈ క్రమంలో ఈ సినిమాను తొలి షో నుంచే ఆ దేశ రాజధాని ఖాట్మండూతో పాటు కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. ఈ డైలాగ్ ను మార్చకపోతే హిందీ సినిమాలను కూడా బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్టుగానే అక్కడ హిందీ చిత్రాలపై బ్యాన్ విధించారు. ఖాట్మండూతో పాటు టూరిస్ట్ టౌన్ అయిన పోఖారాలో హిందీ సినిమాలను నిషేధించారు.
నేపాల్ మేయర్ బలేంద్ర షా మాట్లాడుతూ, ఈ డైలాగ్ వల్ల ఎంతో నష్టం జరుగుతుందని చెప్పారు. ఈరోజు నుంచి నగరంలో హిందీ సినిమాలను ప్రదర్శించనివ్వబోమని తెలిపారు.