టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆదిపురుష్'.. ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందంటే..!
- తొలి మూడు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టిన 'ఆదిపురుష్'
- నెగెటివ్ టాక్ మధ్యే రూ. 305 కోట్ల వసూళ్లు
- తొలి రోజు ఏకంగా రూ. 140 కోట్ల కలెక్షన్స్
ఆదిపురుష్ వసూళ్లు:
- తొలి రోజు (శుక్రవారం) - రూ. 140 కోట్లు
- రెండో రోజు (శనివారం) - రూ. 100 కోట్లు
- మూడో రోజు (ఆదివారం) - రూ. 65 కోట్లు
- తొలి మూడు రోజుల కలెక్షన్లు - రూ. 305 కోట్లు
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ నటించారు. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషించారు. మరోవైపు ఈ చిత్రం తొలి వారంలో భారీ వసూళ్లను సాధించడంలో నిర్మాణ సంస్థ టీసిరీస్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'జై శ్రీరామ్' అని ట్వీట్ చేసింది.