రెండో రోజు కూడా కొనసాగిన పవన్ కల్యాణ్ ధర్మయాగం... వీడియో ఇదిగో!

Pawan Kalyan attends Dharma Yagam for second day
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో చేపట్టిన ధర్మయాగం ఇవాళ కూడా కొనసాగింది. నేడు రెండో రోజు కూడా పవన్ కల్యాణ్ పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధరించిన పవన్ నియమనిష్ఠలతో పూజాదికాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. 

పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి యాత్ర షురూ చేయనున్న సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పూజలతో వారాహి వాహనం ముందుకు కదలనుంది. ఈ యాత్రలో తొలుత పవన్ కత్తిపూడి బహిరంగసభలో పాల్గొననున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Dharma Yagam
Varahi
Janasena
Mangalagiri

More Telugu News