వరుణ్ తేజ్, లావణ్య లవ్ స్టోరీకి ఐదేళ్లు

Varun Tej Lavanya Tripathi engagement and about their love story
  • తొలి సినిమా మిస్టర్ సమయంలోనే వీరి మధ్య స్నేహం
  • అది ప్రేమగా మారి మరింత దగ్గరైన జంట
  • విషయం బయటకు రాకుండా గోప్యత
  • పెళ్లికి పెద్దలను ఒప్పించిన వరుణ్, లావణ్య
  • ఈ ఏడాది చివర్లో వీరి వివాహం
కొణిదెల నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది. సాధారణంగా నటీనటులు, సెలబ్రిటీల మధ్య ప్రేమ, వ్యక్తిగత సంబంధాలు తెగ ప్రచారం అవుతుంటాయి. కానీ, వరుణ్ తేజ్, లావణ్య బంధం గురించి బయటకు వచ్చినప్పటికీ పెద్దగా వ్యాప్తి కాలేదు. అందులోనూ వీరి గురించి బయటకు వచ్చింది కూడా ఆలస్యంగానే. నిజానికి వీరి మధ్య 2017లోనే ప్రేమ చిగురించింది. వీరిద్దరూ కలసి మొదటిసారి మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం, అనంతరం ప్రేమగా మారి, డేటింగ్ కు దారితీసింది. కాకపోతే బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.

వీరిద్దరి రెండో సినిమా అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సమయంలో విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ కలసి పలు పార్టీలకు హాజరయ్యే వారు. వరుణ్ తేజ్ సోదరి నీహారిక వివాహం 2000లో జరగ్గా, అప్పుడు లావణ్య త్రిపాఠి కూడా దర్శనమిచ్చింది. అప్పటి నుంచి వీరి బంధంపై వార్తలు గుప్పుమన్నాయి. కానీ, వారు దీనిపై మౌనమే దాల్చారు. వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తీసుకురాగా, దానికి లావణ్య ఓకే చెప్పినట్టు సమాచారం. అనంతరం వారు తమ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది.

లావణ్య త్రిపాఠి స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్. 1990లో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు, సివిల్ కోర్టు న్యాయవాది. ఆమె తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగు తెరకు పరిచయం అవడం తెలిసిందే.
Go Back to Shorts
Varun Tej
Lavanya Tripathi
engagement
marriage
love

More Telugu News