తండ్రికి మళ్లీ పెళ్లి చేస్తున్న బిగ్‌బాస్ 16 ఫేమ్ నటి సంబుల్
- తండ్రికి మళ్లీ జీవితాన్ని ఇవ్వాలని భావించిన నటి
- సోదరి, పెదనాన్నతో కలిసి తండ్రిని ఒప్పించిన వైనం
- వచ్చే వారమే వివాహం
కొన్నేళ్లుగా తండ్రే తమకు సర్వస్వంగా మారారని, ఆయనే తమకు స్ఫూర్తి అని సంబుల్ పేర్కొన్నారు. తండ్రిని ఒప్పించే విషయంలో పెదనాన్న ఇక్బాల్ హుసైన్ ఖాన్ పోషించిన పాత్ర ఎనలేనిదని, ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. సంబుల్ తండ్రి తౌఖీర్ ఖాన్ త్వరలో నిలోఫర్‌ను పెళ్లాడబోతున్నారు. ఆమెకు అంతకుముందే వివాహమై భర్తతో విడిపోయారు. తొలి భర్త నుంచి ఆమెకు ఇజ్రా అనే కుమార్తె ఉంది.