జైపూర్ లో శర్వానంద్ పెళ్లికి హాజరైన రామ్ చరణ్

Ram Charan spotted at Hyderabad airport while his return from Sharwanand wedding in Jaipur
  • ఓ ఇంటివాడైన టాలీవుడ్ హీరో శర్వానంద్
  • జైపూర్ లో గతరాత్రి శర్వా పెళ్లి
  • నూతన వధూవరులకు శుభకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జైపూర్ లో శర్వానంద్ పెళ్లి రక్షితారెడ్డితో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. నిన్న జైపూర్ లో శర్వా పెళ్లిలో తళుక్కుమన్న రామ్ చరణ్... నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్, శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. చిరంజీవి, సురేఖ దంపతుల వద్ద కూడా శర్వాకు ఎంతో చనువు ఉంది. కాగా, శర్వా పెళ్లి నుంచి తిరిగొస్తున్న రామ్ చరణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిగా నటిస్తోంది.
Advertisement
Ram Charan
Sharwanand
Wedding
Jaipur

More Telugu News