ఆరోపణలు రుజువైతే నేనే ఉరేసుకుంటాను: రెజ్లర్ల అంశంలో బ్రిజ్ భూషణ్ స్పందన
- మహిళా రెజ్లర్ల ఆరోపణలపై స్పందించిన భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్
- నన్ను ఉరి తీయాలని నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్య
- రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచన
- కోర్టు తనను ఉరితీయాలంటే అందుకు అంగీకరిస్తానని వ్యాఖ్య
'నన్ను ఉరి తీయాలని వారు (రెజ్లర్లు) కోరుతూ నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నన్ను ఉరి తీయడం లేదు. అందుకే వారు తమ పతకాలను గంగలో ముంచేందుకు వెళుతున్నారు. పతకాలను గంగలో విసిరినంత మాత్రాన బ్రిజ్ భూషణ్ ను ఉరి తీయరు. మీ వద్ద రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లి ఇవ్వవచ్చు. కోర్టు నన్ను ఉరితీయమంటే నేను దానిని అంగీకరిస్తాను' అన్నారు.
'ఆటగాళ్లంతా నా బిడ్డల్లాంటి వారే... కొన్ని రోజుల క్రితం వరకు నన్ను రెజ్లింగ్ దేవుడు అని పిలిచేవారు... నేను రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోనే భారత్‌కు 20వ ర్యాంక్ వచ్చింది.. ఈ రోజు నా కష్టంతో ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రెజ్లింగ్ జట్లలో భారత్ నిలిచింది' అన్నారు. "నేను పగలు, రాత్రి రెజ్లింగ్ కోసం జీవించాను. ఏడు ఒలింపిక్ పతకాలలో ఐదు (రెజ్లింగ్‌లో) నా పదవీకాలంలోనే భారత్‌కు వచ్చాయి. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి' అని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు.