Tovino Thomas: మలయాళ సూపర్ హిట్ మూవీ '2018' .. స్ట్రీమింగ్ డేట్ ఇచ్చిన సోనీ లివ్!

  • ఈ నెల 5న మలయాళంలో విడుదలైన '2018'
  • అక్కడ భారీ వసూళ్ల నమోదు
  • ఈ నెల 26న థియేటర్లకు వచ్చిన తెలుగు వెర్షన్
  • కంటెంట్ పరంగా కదలనీయకుండా చేసిన సినిమా 
  • జూన్ 7వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్  
2018 Streaming date confirmed

మలయాళంలో ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని సాధించిన సినిమాల జాబితాలో '2018' కనిపిస్తుంది. టోవినో థామస్ .. కుంచాకో బోబన్ .. అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా అక్కడ విడుదలైంది. 

కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన తెలుగులో విడుదల చేశారు. పెద్దగా పబ్లిసిటీ .. ప్రమోషన్స్ లేకపోయినా, ఈ సినిమా నాలుగు రోజుల్లో 4 కోట్లను వసూలు చేసింది. కంటెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారేమో అనుకునేలా ఉండే ఈ సినిమాను, చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించడం విశేషం. 

అయితే ఈ సినిమా జూన్ మొదటివారంలో ఓటీటీలో రానుందనే విషయం ముందుగానే ప్రచారం జరగడం వలన, తెలుగు వెర్షన్ వసూళ్లపై ఎఫెక్ట్ పడింది. అనుకున్నట్టుగానే ఈ సినిమాను జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా సోనీలివ్ ప్రకటించింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More Telugu News