ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన బేబీ
- బ్రిటన్ లో వైద్య నిపుణుల కొత్త పరిష్కారం
- పుట్టే శిశువుల్లో జన్యులోపాల నివారణకు ఈ విధానం
- తల్లిదండ్రులతో పాటు మరో దాత నుంచి డీఎన్ఏ
ఈ బేబీలో అధిక శాతం డీఎన్ఏ తల్లిదండ్రులదే ఉంది. కాకపోతే మూడో వ్యక్తి డీఎన్ఏ కేవలం 0.1 శాతమే అని గుర్తు పెట్టుకోవాలి. మరో మహిళ దాతగా ముందుకు రాగా, ఆమె నుంచి సేకరించారు. బ్రిటన్ లోని న్యూకాస్టిల్ ఫెర్టిలిటీ కేంద్రం ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. మైటోకాండ్రియల్ వ్యాధి నివారణకు ఈ విధమైన ప్రక్రియలను అనుసరించేందుకు బ్రిటన్ పార్లమెంట్ 2015లో చట్టాల్లో మార్పులు చేయడం గమనార్హం.
మన శరీరంలోని అన్ని కణాలకు శక్తి అందాలంటే మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయాల్సిందే. జన్యువుల్లో లోపాలతో మైటోకాండ్రియల్ తదితర వ్యాధుల రిస్క్ ఏర్పడుతుంది. కేవలం తల్లి ద్వారానే బేబీలకు ఈ సమస్య సంక్రమిస్తుంది. అందుకని తల్లి నుంచి పిల్లలకు అది బదిలీ కాకుండా నివారించేందుకే వైద్యులు మూడో వ్యక్తి డీఎన్ఏను జొప్పిస్తున్నారు. దీనివల్ల పుట్టే బిడ్డ అనారోగ్యం బారిన పడకుండా నివారించొచ్చు.