ఎన్ ఫీల్డ్ బండితో జేసీ ప్రభాకర్ రెడ్డి పోజులు... మామూలుగా లేవు!

JC Prabhakar Reddy shares his bike passion
  • రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • తాను కుర్రాడిగా ఉన్నప్పుడు జావా బండి నడిపేవాడ్నని వెల్లడి
  • నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటానని వివరణ
  • ట్విట్టర్ లో ఫొటోలతో సందడి చేస్తున్న జేసీ
ఏపీలో విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేతల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు. అటు సంప్రదాయాలు, ఇటు ఆధునికత మేళవించిన నేతగా జేసీ గురించి చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్.

తాజాగా, ఆయన సోషల్ మీడియాలో రెండు ఆసక్తికరమైన ఫొటోలను పంచుకున్నారు. తనదైన వేషధారణతో ఉన్న జేసీ... ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలో క్లాసిక్ బండి పక్కన నిల్చుని పోజులు ఇచ్చారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. 

తాను కుర్రాడిగా ఉన్నప్పుడు జావా మోటార్ సైకిల్ నడిపేవాడ్నని, అప్పుడప్పుడు ఆనాటి జ్ఞాపకాలను ఇలా నెమరువేసుకుంటుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి ట్విట్టర్ లో వెల్లడించారు.
Go Back to Shorts
JC Prabhakar Reddy
Royal Enfiled
Classic
Jawa
Bike
TDP
Tadipatri
Andhra Pradesh

More Telugu News