‘తంగలాన్’ రిహార్సల్స్ లో గాయపడ్డ చియాన్ విక్రమ్
- హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
- పక్కటెముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు
- ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి
ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో తంగలాన్ సినిమా చిత్రీకరణకు విక్రమ్ కొంతకాలంగా దూరంగా ఉన్నారు. తాజాగా తంగలాన్ సినిమా షూటింగ్ రిహార్సల్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా రిహార్సల్ సెషన్ జరుగుతోంది.