'విమానం’ సినిమా నుంచి ‘రేలా రేలా’ సాంగ్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'విమానం’ సినిమా నుంచి ‘రేలా రేలా’ సాంగ్ రిలీజ్!

Vimanam Lyrical Song Released
  • సముద్రఖని ప్రధాన పాత్రధారిగా 'విమానం'
  • తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ  
  • దర్శకుడిగా శివప్రసాద్ యానాల పరిచయం
  • జూన్ 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
ఓ చిన్న కుర్రాడు .. అత‌నికి విమానం ఎక్కాల‌ని ఎంతో ఆశ‌ .. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరిక‌ను తండ్రికి చెబితే బాగా చ‌దువుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని చెబుతాడు. అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే తండ్రి వీర‌య్య ఎలాంటి క‌ష్టం తెలియ‌కుండా త‌ల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మ‌రి ఆ పిల్లాడి కోరిక తీరిందా?లేదా? అనేది కథ.  

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఏ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా ..’ అనే లిరికల్ సాంగును మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయడం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ పాటను తనదైన పంథాలో అద్భుతంగా పాటను ఆలపించారు. 

వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు. జూన్ 9వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Advertisement
Samudrakhani
Anasuya
Vimanam Movie

More Telugu News