ఈవీ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీయే ఆఫీసుకు వచ్చిన రవితేజ

Raviteja spotted at Khairatabad RTA office
  • కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన రవితేజ
  • వాహనం ఖరీదు రూ.34.49 లక్షలు!
  • రవితేజ ఈవీకి టీఎస్09 జీబీ2628 నెంబరు
  • వేలంలో రూ.17,628కి దక్కించుకున్న వైనం 
టాలీవుడ్ హీరో రవితేజ కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) కొనుగోలు చేశారు. తన ఈవీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన హైదరాబాదులోని ఖైరతాబాద్ ఆర్టీయే ఆఫీసుకు విచ్చేశారు. 

రవితేజ కొనుగోలు చేసిన వాహనం బీవైడీ ఓట్టో 3 ఈవీ. ఈ వాహనం ఖరీదు రూ.34.49 లక్షలు. తన కొత్త ఈవీ కోసం రవితేజ టీఎస్09 జీబీ2628 నెంబరు వేలంలో రూ.17,628కి దక్కించుకున్నారు. రవితేజ రాకతో ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయంలో సందడి నెలకొంది. 

ఇటీవల మళ్లీ పికప్ అయిన రవితేజ రావణాసుర చిత్రంతో కొన్నిరోజుల కిందటే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్ర పోషించారు. ఈ సినిమా నిర్మాణంలోనూ రవితేజ పాలుపంచుకున్నారు. 

సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసుర చిత్రంలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు నటించడం విశేషం. అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాశ్, దక్ష నగార్కర్ ఈ సినిమాలో కథానాయికలు.
Advertisement
Raviteja
EV
Registration
Khairatabad RTA
Hyderabad
Tollywood

More Telugu News