ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేశాడు!
- మూడు రోజుల కిందట ప్రారంభమైన ‘ఓజీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్
- ఈ రోజు సెట్స్ లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్
- భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న యువ దర్శకుడు సుజీత్
‘ఓజీ’ సినిమాను పవన్ అభిమాని, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. మూడు రోజుల కిందట ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.


