Pastam Mogilayya: 'బలగం' సినిమా ఫేమ్ పస్తం మొగిలయ్య పరిస్థితి విషమం

Balagam fame Mogilayya suffered with heart attack
షార్ట్స్‌లో చూడండి
సంచలన విజయం సాధించిన బలగం చిత్రంలో నటించిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు ఆ సినిమాలో తమ గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. 

కాగా, పస్తం మొగిలయ్య కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది. దాంతో, కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటీన హైదరాబాద్ తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

పస్తం మొగిలయ్య స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి. ఊరూరా తిరుగుతూ కథలను గానం చేస్తూ బతుకుబండి నడిపిస్తున్నారు. మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమాలో నటించారు. 

కొంతకాలం కిందట మొగిలయ్య చేయి విరగడంతో ఆసుపత్రికి వెళ్లగా రెండు కిడ్నీలు పాడైపోయిన విషయం వెల్లడైంది. అప్పటినుంచి ఆయనకు వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ చేస్తున్నారు. అందులో భాగంగా రక్తం ఎక్కించేందుకు శరీరంపై 11 చోట్ల రంధ్రాలు చేయాల్సి వచ్చింది. చివరిగా ఛాతీ వద్ద రంధ్రం చేసి రక్తం ఎక్కిస్తుండగా గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Pastam Mogilayya
Heart Attack
Hyderabad
Warangal
Balagam
Telangana

More Telugu News