'రావణాసుర'తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం: రవితేజ
- హైదరాబాదులో జరిగిన 'రావణాసుర' ప్రీ రిలీజ్ ఈవెంట్
- తన ఎనర్జీకి కారణం అభిమానులేనన్న రవితేజ
- ఈ సినిమాలో కొత్త సుశాంత్ ను చూస్తారని వెల్లడి
- తప్పకుండా హిట్ కొడతామని వ్యాఖ్య
- ఈ నెల 7వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాలో భీమ్స్ ఒక పాట చేశాడు .. అది గొప్పగా వచ్చింది. మిగతా పాటలను హర్షవర్ధన్ రామేశ్వర్ చేశారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మా హీరోయిన్స్ అంతా తెరపై చాలా బ్యూటిఫుల్ గా సందడి చేశారు. ఈ సినిమా తరువాత నాతో ఆది కాంబినేషన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది" అని అన్నారు.
"ఇక సుశాంత్ తో చేసిన ప్రతి సీన్ ను నేను ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో మీరంతా కొత్త సుశాంత్ ను చూస్తారు. ఈ సినిమా తరువాత దర్శకుడిగా సుధీర్ వర్మ నెక్స్ట్ లెవెల్ కి వెళతాడు. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది. ఏప్రిల్ 7 నుంచి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చారు.